వ్యాక్సినేషన్‌లో డోస్‌ల కొరత
– వెనుదిరిగి వెళుతున్న అర్హులు
తాండూరు, దర్శని ప్రతినిధి: కరోనా మహమ్మారిని తరిమేందుకు ఇస్తున్న వ్యాక్సీనేషన్‌లో డోసుల కొరత ఏర్పడింది. తాండూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఇంటింటికి వ్యాక్సీనేషన్ స్పెషల్ డ్రైవ్ వద్దకు వచ్చిన లబ్దిదారులంతా వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఈనెల 16న ఇంటింటి వ్యాక్సీనేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. నాలుగు రోజుల నుంచి పట్టణంలో వివిధ వార్డులలో వ్యాక్సీనేషన్ కొనసాగుతోంది. 18 ఎండ్లు నిండిన యువతీ, యువకులతో పాటు మహిళలు, పురుషులకు టీకా వేస్తున్నారు. వ్యాక్సీనేషన్ మంచి స్పందన లభిస్తోంది. కాని స్పెషల్ డ్రైవ్ శిబిరాల వద్ద వ్యాక్సీనేషన్ కొరత కనిపిస్తోంది. ఆయా వార్డుల్లోని శిబిరాల వద్ద 80 నుంచి 100 మంది వరకు వస్తే సుమారు 39 నుంచి 60 మందిలోపే టీకాలను వేస్తున్నారు. వ్యాక్సీన్ కొరత కారణంగానే మిగిలిని వారికి టీకాలు వేయలేకపోతున్నారు. దీంతో లబ్దిదారులు శిబిరాల వద్ద పేర్లను నమోదుచేయించుకుని వెళుతున్నారు. మరోవైపు లబ్దిదారులకు అనుగుణంగా వ్యాక్సీనేషన్‌ను పంపిణీ చేయాలని ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులు కోరుతున్నారు.
