తాండూరులో ఎక్సప్రెస్ రైళ్లను ఆపాలి
– ప్రయాణికులకు అనుగుణంగా బోగీలు పెంచండి
– పుష్ పుల్ సర్వీసులో టైమింగ్ మారిస్తే మేలు
– రైల్వే డీఆర్ఎంకు మార్వాడి యువమంచ్ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపేలా చూడాలని దక్షిణ మద్య రైల్వే శాఖ డీఆర్ఎం డా.గోపాల క్రిషన్ ను మార్వాడి యువమంచ్ సభ్యులు కోరారు.

బుధవారం తాండూరు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అమృత్ భారత్ పనులను పరిశీలించేందుకు డీఆర్ఎం డా. గోపాల క్రిప్షన్ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, తాండూరు అధ్యక్షులు అనిల్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠీ, మాజీ అధ్యక్షులు విజయ్ ప్రకాష్ సార్డాలు ఆయను కలిసి సన్మానించారు. అనంతరం వినతిపత్రం అందించారు.

తాండూరు నుంచి చాలా మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు రైళ్ల ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నారని వివరించారు. వారి సౌలభ్యం కోసం తాండూరు నుంచి పుష్ పుల్ రైలును ఉదయం 7 గంటలకు, హైదరాబాద్ నుంచి సాయంత్రం 7గంటలకు నడిపించేలా చూడాలని కోరారు. అదేవిధంగా హుబ్లీ, బీజాపూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ బోగీల సంఖ్య పెంచాలని కోరారు. దీంతో పాటు యశ్వంత్ పూర్ – గోరఖ్ పూర్, యశ్వంత్ పూర్ – కటార, భువనేశ్వర్ – పూణే రైళ్లలను తాండూరులో ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు డీఆర్ఎం డా.గోపాల క్రిష్ణన్ సానుకూలంగా స్పందించారు.

ఇదికూడా చదవండి…

