జంట మరణాల సస్పెన్స్‌కు తెర..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

జంట మరణాల సస్పెన్స్‌కు తెర..!
– తల్లీ, కొడుకులుగా మృతదేహాల గుర్తింపు
– బందువుల విచారణలో ఆచూకీ
– ఆత్మహత్యగా ప్రాథమిక నిర్దారణ
– మరణాలకు కారణం అదే అని అనుమానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులో వెలుగులోకి వచ్చిన జంట మరణాల సస్పెన్స్‌కు తెరపడింది. మృతుల బందువులు మృతదేహాలను గుర్తించడం మిస్టరీ వీడిపోయింది.

మంగళవారం తాండూరు ఐనెల్లి గ్రామ శివారులోని పాడుబడిన ఇంట్లో ఆడ, మగ మనుషుల మృతదేహాలను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న తాండూరు రూరల్ సీఐ ప్రవీణ కుమార్ రెడ్డి, కరణ్‌ కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో ఐనెల్లి గ్రామ పరిసర గ్రామాల ప్రాంతాల వారితో విచారణ చేపట్టగా మృతుల వివరాలు తెలిసాయి.

తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన రమేష్‌ అనే వ్యక్తి వచ్చి తన అక్క కమ్మరి తల్జమ్మ(50), ఆమె కుమారుడు నరేష్‌(25), కోటబాస్పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కమ్మరి శంకర్, కమ్మరి తుల్జమ్మలు భార్య భర్తలుగా, వారి కుమారుడు నరేష్‌ అని పోలీసులకు తెలిపారు. గ్రామాన్ని వదిలి వారు కోటబాస్పల్లిలో నివాసం ఉంటున్నారని తెలిపారు.

నరేష్‌కు గత కొన్నేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం మిర్యాణంకు చెందిన మౌనిక అనే మహిళతో వివాహం జరిగిందని, వీరికి ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం. నరేష్, మౌనిక మద్య వివాదాలు జరుగుతున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో మౌనిక నరేష్‌ను వదిలి వెళ్లిపోయింది. కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది తుల్జమ్మ, నరేష్‌లు 10 రోజుల క్రితం వెళ్లిపోయారని తెలిపాడు. పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

విద్యార్థి తల్లితో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన..?!