కాలనీలో యువకుడి మృతదేహం..!
– తాండూరు రైల్వే క్వార్టర్స్ వద్ద కలకలం
– బాడీపై అనుమానాస్పద గాయాలు
– మృతుని స్నేహితులపై అనుమానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఓ యువకుడి మృత దేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

ప్రాథమిక సమాచారం మేరకు.. పట్టణంలోని మాణిక్ నగర్ ప్రాంతంకు చెందిన మున్వర్ ఆటో నడిపిస్తూ వాటర్ బాటిల్ విక్రయిస్తున్నాడు. శుక్రవారం ఉదయం రైల్వే క్వార్టర్స్ వద్ద మృతి చెంది కనిపించాడు. యువకుడి కడుపు వద్ద కత్తి పోట్లు కనిపించడం అనుమానాలు రేకెత్తించాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడి మృతి పట్ల పోలీసులు అతని ఇద్దరు స్నేహితులపై అనుమానాలు వ్యక్తం చేశారు.

మున్వర్, అతని స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు విచారణలో తెలిసింది. వారి కోసం గాలింపు చేపట్టిన్నట్లు సమాచారం. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పరమేశ్వర్ తెలిపారు.


