వార్డుల సమస్యల పరిష్కారానికి కృషి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– మల్ రెడ్డిపల్లిలో డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణాలకు పూజ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని వార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు పాండురంగ కాలనీ, మల్ రెడ్డిపల్లిలో ప్రజలకు ఇబ్బందిగా మారిన డ్రైనేజీ, కల్వర్టుల సమస్యకు పరిష్కారం లభించింది. శనివారం వార్డులో నిర్మిస్తున్న డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణ పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలతతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో మున్సిపల్‌లోని అన్ని వార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుగుతుందన్నారు. వార్డుల్లో డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ మాట్లాడుతూ మల్ రెడ్డిపల్లిలోని ఏండ్లుగా నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బాలప్ప, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఈ ఖాజా హుస్సేన్, నాయకులు కావలి సంతోష్ కుమార్, బాతుల భీమం, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

