ప్రతి ఇంటికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకం చేరాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రతి ఇంటికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకం చేరాలి..!
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు
– కౌన్సిలర్లకు, వార్డు ప్రెసిడెంట్లకు పత్రాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే లక్ష్యమని తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు అన్నారు.

సోమవారం పార్టీ కార్యాలయంలో 36వార్డులకు చెందిన కౌన్సిలర్లు, వార్డు ప్రెసిడెంట్లకు ఇందిరమ్మ బీమా ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బాతుల నాగు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు పట్టణంలోని ప్రతి ఇంటికీ చేరాలన్నదే తమ లక్ష్యమన్నారు.

అర్హులైన కుటుంబాలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించి, వారు సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తామని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కల్పించే ఈ పథకంపై ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో రేపు ప్రభుత్వ సెలవు!