మళ్లీ అదే వైన్స్..!
– టార్గెట్ చేసి చోరి చేసిన మళ్లీ దొంగలు
– రూ.50 వేల నగదు, మద్యం అపహరణ
– దొంగతనం ఎలా చేశారంటే..?
యాలాల, దర్శిని ప్రతినిధి : మండల కేంద్రంలోని ఎస్ఎల్వీ యాలాల వైన్స్‌ను దొంగలు మరోసారి టార్గెట్ చేశారు. గతంలో పైకప్పు రేకులు తొలగించి చోరీకి పాల్పడిన దుండగులు.. తాజాగా గోడకు రంధ్రం వేసి లోపలికి ప్రవేశించి మరోసారి చేతివాటం ప్రదర్శించారు.

మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుమారు నాలుగు నెలల క్రితం ఇదే వైన్స్‌లో పైకప్పు రేకులు తొలగించి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆ ఘటన మరువకముందే మరోసారి అదే దుకాణాన్ని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.

ఈసారి వైన్స్ గోడ పైభాగంలో రంధ్రం వేసి లోపలికి ప్రవేశించిన దొంగలు రూ.50 వేల నగదుతో పాటు ఐదు ఫుల్ బాటిళ్ల మద్యాన్ని అపహరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

చోరీకి సంబంధించిన దృశ్యాలు వైన్స్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వరుసగా రెండుసార్లు ఒకే వైన్స్‌లో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది.


