గ్రాడ్యుయేట్‌ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

గ్రాడ్యుయేట్‌ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
– డిసెంబర్‌ 10 వరకు అభ్యంతరాలు, కొత్త దరఖాస్తుల స్వీకరణ
– వచ్చేనెల 30న తుది జాబితా ప్రకటన
– స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : గ్రాడ్యుయేట్‌ ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల అధికారులు విడుదల చేశారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో 5,68,105 మంది, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో 6,21,086 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలను [ceotelangana.nic.in](https://ceotelangana.nic.in/) వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు.

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను డిసెంబర్‌ 10వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఇదే గడువులో గ్రాడ్యుయేట్‌ ఓటు నమోదు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.

డిసెంబర్‌ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. తుది జాబితా విడుదలైన తర్వాత కూడా గ్రాడ్యుయేట్‌ ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

మార్మోగిన అయ్యప్ప నామస్మరణ..!