ఒక‌టి.. రెండు.. డోసులు త‌ప్పక వేసుకోవాలి

తాండూరు వికారాబాద్

ఒక‌టి.. రెండు.. డోసులు త‌ప్పక వేసుకోవాలి
– తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రు ఒక‌టి.. రెండో డోసు కోవిడ్ టీకాలు త‌ప్ప‌క వేసుకోవాల‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు అన్నారు. మంగ‌ళవారం మున్సిప‌ల్ ప‌రిధి త‌న వార్డు 9లో దీపా న‌ర్సింలు ప‌ర్య‌టించి వ్యాక్సీనేష‌న్ డ్రైవ్‌ను సమీక్షించారు. కేంద్రానికి వ‌చ్చిన వారితో మాట్లాడుతూ మొద‌టి.. డోసా.. రెండో డోసా అంటూ ఆరా తీశారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రు ఒక‌టి.. రెండో డోసులు త‌ప్ప‌క వేసుకోవాల‌ని సూచించారు.
రెండు డోసులు పూర్తి చేసుకుంటేనే క‌రోనా నుంచి.. ఒమిక్రాన్ వైరస్ ముప్పునుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చ‌న్నారు. అదేవిదంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ వ్యాక్సీనేష‌న్ ప్ర‌క్రియ‌ను ఉద్య‌మంలా చేప‌ట్టాల‌ని సూచించారు. ఇంటింటికి వెళ్లి క‌రోనా టీకా ప్రాముఖ్య‌త‌పై అగాహ‌న క‌ల్పించాల‌న్నారు. ప్ర‌జ‌లు కూడ స‌హ‌క‌రించి తాండూరులో వ్యాక్సీనేష‌న్ వంద‌శాతం పూర్తికి తోడ్ప‌డాల‌న్నారు. టీకా వేసుకున్న త‌రువాత మాస్కులు, భౌతిక దూరం పాటించి శానిటైజ‌ర్ వినియోగించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వైద్య సిబ్బంది సుధారాణి, అంగ‌న్‌వాడి టీచ‌ర్ నవీనా, ఆర్పీ సైరాభాను, వీఆర్ఐ అనిత‌, స్పెష‌ల్ ఆఫీస‌ర్ రాంచంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.