టీఆర్ఎస్ నాయ‌కుడి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి

రాజకీయం వికారాబాద్

టీఆర్ఎస్ నాయ‌కుడి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
– అగ్గ‌నూర్‌లో ఉప్ప‌రి భీమ‌య్య క‌న్నుమూత‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నియోజ‌కవ‌ర్గం యాలాల మండ‌లంలోని అగ్గ‌నూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయ‌కుడి కుటుంబాన్ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అగ్గనూర్ ఉన్నత పాఠశాల చైర్మన్ ఉప్పరి వెంకటయ్య గారి తండ్రి ఉప్పరి భీమయ్య క‌న్నుమూశారు. శ‌నివారం ఉద‌యం ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అగ్గ‌నూర్ గ్రామానికి చేరుకున్నారు. వెంక‌ట‌య్య స్వగృహానికి వెళ్లి భీమ‌య్య భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు. అనంత‌రం వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్సీ వెంట సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు, మాజీ జడ్పీటిసి సిద్రాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, అగ్గనూర్ సర్పంచ్ బీమప్ప,నాయకులు సిద్దారెడ్డి తదితరులు ఉన్నారు.