ఫెయిల్ అయినోళ్లంద‌రు పాస్..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఫెయిల్ అయినోళ్లంద‌రు పాస్..!
– ఫ‌స్ట్ ఇయర్ వాళ్ల‌కు క‌నీస‌ మార్కులు
– తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం
– సెకండ్ ఇయ‌ర్‌కు ఈ చాన్స్ ఉండ‌దు
– తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితారెడ్డి
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో ఫెయిల్ అంద‌రిని పాస్ చేస్తున్న‌ట్లు తెలంగాణ స‌ర్కారు ప్ర‌క‌టించింది. స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్వ‌యంగా వెల్ల‌డించారు. శుక్ర‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అందరిని కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరు పాస్ అయినట్లు ప్రకటించారు. ప‌రీక్షా ఫ‌లితాలలో ఇంటర్ బోర్డు ఎక్కడ మిస్టేక్ చేయలేదని, ఫెయిల్ అయిన వాళ్లందరూ వచ్చి బోర్డు, ప్రభుత్వం ఎదో తప్పు చేసినట్లు మాట్లాడటం బాధాకరమని అన్నారు.. విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు కూడా పిల్లల కెరీర్ విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పిల్లలు బాగా చదువుకోవడానికి మోటివేట్ చేయాలన్నారు. 10 మార్కులు కలిపితే 8,070 మంది ఉత్తీర్ణులవుతారని 25 మార్కులు కలిపితే 70 వేల మంది పాసవుతారని పేర్కొన్నారు. ఈ ఫలితాల ప్రభావం సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‎పై పడొద్దని ఈ నిర్ణయం తీసుకున్నాట్లు సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. మ‌ళ్లీ సెకండ్ ఇయ‌ర్‌లో ఇలాంటి చాన్స్ ఉండ‌ద‌ని.. అందరు కష్టపడి చదవాల్సిందే అని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా

కరోనా విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. దాన్ని అధిగమించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని వివరించారు. రాష్ట్రంలో 900పైగా గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. 620 గురుకులాలను ఇంటర్‎కు అప్‎గ్రేడ్ చేశామన్నారు. ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానెల్‎ను 3 లక్షల పైగా పిల్లలు సబ్‎స్ర్కైబ్ చేసుకొని చూశారని సబితా తెలిపారు. డిజిటల్, టి షాట్ ద్వారా క్లాసులు నిర్వహించే ప్రయత్నం చేశామన్నారు. 9 పరీక్షలు రాయాల్సిన స్టూడెంట్స్‎ని 10thకి ప్రమోట్ చేశామని టెన్త్ వారిని ఇంటర్ ప్రమోట్ చేశామని.. ఇంటర్ సెకండ్ ఇయర్ వారిని కూడా ప్రమోట్ చేశామని గుర్తు చేశారు. సెకండ్ ఇయర్ వెళ్లే ముందు1st ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని నిర్ణయించమన్నారు. ఎన్నో ఆలోచించి నెల రోజుల టైం ఇచ్చి పరీక్షలు పెట్టామన్నారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది పాస్ అయ్యారని చెప్పారు.