దివ్యాంగుడికి చేయూత..!
– ట్రైసికిల్ను అందజేసిన కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మక్సూద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : నడవలేక ఇబ్బందులు పడుతున్న ఓ దివ్యాంగుడికి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ తాండూరు పట్టణ ప్రెసిడెంట్ షేక్ మక్సూద్ చేయూతనందించారు. గురువారం తన సొంత ఖర్చులతో ట్రైసైకిల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా షేక్ మక్సూద్ మాట్లాడుతూ తాండూరు పట్టణానికి చెందిన ఓ దివ్యాంగుడు(నడవడం, మాట్లాడడం రాదు) అనాధగా ఉన్నాడని తెలిపారు. గత నాలుగు నెలలుగా తాండూరు ఫ్లైఓవర్ కింది భాగంలో తహసీల్దార్ కార్యాలయం మార్గంలో వస్తూ పోతూ.. రోజూ నడవలేక ఇబ్బందులు పడడం గమనించడం జరిగిందన్నారు. అతనికి సాయం చేయాలని నేతలను కోరినా ఎవ్వరు ముందుకు రాకపోవడంతో సొంతంగా ట్రైసైకిల్‌ను అందజేయడం జరిగిందన్నారు. మానవతా దృక్పథంతోనే అతనికి తనవంతు సహాకారం అందించడం జరిగిందని, ఇంకా అతనికి ఏమైనా సహాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు.

