వైభవంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి
– శబరిగిరీశుడి దర్శనానికి పయనం
– స్వాముల సేవ చేసిన డాక్టర్ సంపత్, సునితా సంపత్ దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మాల ధరించిన స్వాముల ఇరుముడి కార్యక్రమం వైభవంగా జరిగింది. సోమవారం తాండూరులోని మురుగన్ ఆశ్రమానికి చెందిన అయ్యప్ప స్వాములు ఇరుముళ్లతో శబరిమల యాత్రకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆలయంలో గురుస్వాములు, వేద పండితులు ఆశ్రమానికి చెందిన 44 మంది స్వాములకు భక్తి శ్రద్ధలతో ఇరుముళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో స్వాముల పేటతుళ్లి నృత్యాలు, ఆట పాటలు ఆకట్టుకున్నాయి. శబరిమల యాత్ర సందర్భంగా స్వాముల కుటుంబ సభ్యులు, బందువులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వాములకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
మరోవైపు అయ్యప్ప స్వాముల సేవలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపర్ కుమార్లు తరించారు. శబరిమలకు బయల్దేరిన స్వాములకు సద్ధి నిర్వహించారు. అదేవిధంగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎ స్ సీనియర్ నాయకులు రాజుగౌడ్, సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్, కౌన్సిలర్లు సుంకాల రాఘవేందర్, సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్, లక్ష్మణ్, పట్టణ ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

