మ‌హేంద్ర‌న్నా.. క్షేమంగా కోలుకోవాలి

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

మ‌హేంద్ర‌న్నా.. క్షేమంగా కోలుకోవాలి
– దేవాల‌యాలు, చెర్చి, మ‌సీదుల్లో ప్రార్థ‌న‌లు
– దేవుళ్లను వేడుకుంటున్న టీఆర్ఎస్ నేత‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని తాండూరు టీఆర్ఎస్ నేత‌లు చాటుకుంటున్నారు. క‌రోనా బారిన ప‌డిన మ‌హేంద్ర‌న్న క్షేమంగా కోలుకోవాల‌ని దేవుళ్ల‌ను ప్రార్థిస్తున్నారు. గ‌త మూడు రోజుల క్రితం ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి క‌రోనా బారిన ప‌డి హోం ఐసోలేష‌న్‌లో ఉండిపోయారు. ఈ విషయం తెలిసిన తాండూరు టీఆర్ఎస్ నేత‌లు తొలి రోజు నుంచి దేవాల‌యాల‌కు వెళ్లి పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.
మంగ‌ళ‌వారం కూడ మ‌హేంద్రుడి కోసం పూజా కార్య‌క్ర‌మాలు కొన‌సాగాయి. టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పుషోత్తం రావు, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, మాజీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్న‌మాల‌, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడ‌ర్ బొబ్బిలి శోభారాణి, సీనీయ‌ర్ ప‌ట్లోళ్ల‌ నీరజ బాల్ రెడ్డి, కో అప్షన్ స‌భ్యురాలు ఉషరాణి, కౌన్సిల‌ర్ బోయ‌ర‌వి, వెంక‌న్న‌గౌడ్ త‌దిత‌రులు పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.
మున్సిప‌ల్ ప‌రిధి పాత తాండూరులోని ప్ర‌సిద్ద బోనమ్మ దేవాలయం, తాండూరులోని భ‌ద్రేశ్వ‌ర దేవాల‌యం, రసూల్ పూర్ హనుమాన్ దేవాల‌యం, ప‌ట్ట‌ణంలోని ద‌ర్గాలు, మ‌సీదుల‌తో పాటు రాజీవ్ కాలనీలో చర్చ్ లో ప్రార్థ‌న‌లు చేశారు. క‌రోనా నుంచి మ‌హేంద‌ర్‌రెడ్డి ఆరోగ్యంగా కోలుకోవాల‌ని ప్రార్థించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయకులు భ‌ర‌త్ భూష‌ణ్, సాయిపూర్ ప‌ట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ కౌన్సిల‌ర్ జుబేర్ లాల‌, సంజీవ‌రావు, రాజ‌శేఖ‌ర్, నాయ‌కులు కేశవ‌రావు, అంజిల్ రెడ్డి, టీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయ‌కులు బిర్క‌డ్ ర‌ఘు, తాండూరు అధ్య‌క్షులు రాకేష్ తాండ్ర‌, యువ నాయకులు ఎర్రం శ్రీ‌ధ‌ర్‌, అశోక్, ద‌త్తు, టైల‌ర్ ర‌మేష్‌, శ్రీ‌కాంత్‌రెడ్డి, మహేంద్రన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

తాండూరు మండ‌లంలో
మ‌రోవైపు తాండూరు మండ‌లంలో కూడ మ‌హేంద‌ర్ రెడ్డికోసం నాయ‌కులు పూజ‌లు నిర్వ‌మించారు. మండ‌లంలోని క‌ర‌ణ్ కోట్‌లో మ‌హేంద‌ర్ అన్న యువ‌సేన అధ్య‌క్షులు సుద‌ర్శ‌న్‌తో పాటు ప‌లువురు గ్రామంలోని మారెమ్మ దేవాల‌యంలో పూజ‌లు చేసి మ‌హేంద‌ర్ రెడ్డి కోలుకోవాల‌ని వేడుకున్నారు.