ఇరుముడితో శబరికి బయల్దేరిన కౌన్సిలర్
– కరోనా అంతమై పోవాలని పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: నియమ నిష్టలతో అయ్యప్ప మాల వేసిన మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ ఇరుముడితో శబరిమలైకి బయల్దేరారు. తాండూరు మున్సిపల్ పరిధి 26వ వార్డు కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ 40 రోజుల పాటు దీక్ష పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి మహోత్సవాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించుకున్నారు. గురుస్వామి, వేద పండితుల మంత్రోచ్చరణల మద్య ఇరుముడిని పూర్తి చేసుకున్నారు. ఆలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యే పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి అంతమైపోవాలని వేడుకున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్, కరోనా నుంచి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

