బ‌స్తీ ద‌వ‌ఖానా ఏర్పాటు చేయండి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

బ‌స్తీ ద‌వ‌ఖానా ఏర్పాటు చేయండి
– జిల్లా వైద్యాధిరికి కౌన్సిల‌ర్ బొంబీనా విన‌తి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలోని పాత తాండూరులో బ‌స్తీ ద‌వ‌ఖాన ఏర్పాటు చేయాల‌ని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్ట‌ర్ తుకారాం నాయ‌క్‌ను తాండూరు మున్సిప‌ల్ ఎంఐఎం కౌన్సిల‌ర్ బొంబీనా కోరారు. మంగ‌ళ‌వారం పాత తాండూరు అంబేద్క‌ర్ పార్కులోని క‌మ్యూనిటీ హాల్‌ను జిల్లా వైద్యాధికారి డాక్ట‌ర్ తుకారం నాయ‌క్ ఉప వైద్యాధికారి డాక్ట‌ర్ ధ‌ర‌ణి కుమార్‌తో క‌లిసి సంద‌ర్శించారు. ఈ విష‌యం తెలుసుకున్న కౌన్సిల‌ర్ బొంబీనా వైద్యాధికారి క‌లిసి మాట్లాడారు. పాత తాండూరు వాసుల కోసం క‌మ్యూనిటి హాల్‌లో బ‌స్తీ ద‌వాఖాన‌ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం వైద్యాధికారికి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కౌన్సిల‌ర్ ఇర్ఫాన్ త‌దిత‌రులు ఉన్నారు.