రైతులపై కక్ష్య కట్టిన కేంద్రం
– పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి
– టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం) అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, పంటలకు గిట్టుబాటు ధర వంటి పథకాలను అమలు చేస్తు రైతుల అభ్యున్నతికి పాల్పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు, రైతులపై దాడులు వంటి వ్యవహారాహాలతో వారిని అన్యాయానికి గురిచేస్తుందన్నారు. తాజాగా ఎరువులధరలను పెంచి రైతులపై భారం మోపేందుకు యత్నిస్తుందని విమర్శించారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే రైతులు ఉద్యమాలతో కేంద్రాన్ని గద్దెదించే పరిస్థితులు తప్పవని హితవు పలికారు.

