ఆమోద ఎజెండాకు అభ్యంతరం
– హైకోర్టులో ఫిటీషన్‌కు సానుకూల స్పందన
– అభివృద్ధికి అడ్డంకులు లేకుండా పూర్తి సహకారం
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 22న నిర్వహించిన తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన ఎజెండాకు చిక్కులు వచ్చిపడ్డాయి. తన సంతకం లేకుండా ఎజెండాను ప్రవేశ పెట్టడం, ఆమోదించడంపై చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త హైకోర్టులో ఫిటిషన్ వేశారు. దీంతో ఆమోదించిన మున్సిపల్ ఎజెండాకు హైకోర్టులో అభ్యంతరం లభించిందని చైర్ పర్సన్ స్వప్న బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాజీ వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల రత్నమాల, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈనెల 22న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇంచార్జ్ కమీషనర్ తన సంతకం లేనిదే ఏజెండాను ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. అధికారులు, ప్రతిపక్ష కౌన్సిలర్లతో కుమ్మక్కై ఆమోదించడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ చట్టం 2019 ప్రకారం నిబంధనలకు వ్యతిరేకంగా ఆమోదించిన ఎజెండా పై ఈ నెల 24న హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని చెప్పారు. దీన్నిపై హైకోర్టులో సానుకూలంగా ఎజెండాపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. గురువారం దీనిపై రాతపూర్వకంగా అనుకూలమైన ఉత్తర్వులు రామన్నాయని పేర్కొన్నారు. చైర్ పర్సన్‌కు వ్యతిరేకంగా ఆమోదించిన ఎజెండాపై హక్కుల కోసం వేసిన ఫిటిషన్‌లో న్యాయం జరుగుతుందని అభిలాషించారు. అధికారులు, ప్రతిపక్ష కౌన్సిలర్లు తమ వాక్కులకు వ్యతిరేకంగా వ్యవరించడం తగదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమ్యలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల చైర్ పర్సన్లు, మేయర్లు అధికారులు కాలరాసే హక్కులను సాధించేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఎజెండాలో ప్రవేశ పెట్టిన అభివృద్ధి పనులను తాము ఏమాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీపీసీ సభ్యులు పబ్లి ళ్ల నర్సింలు, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, బోయరవి, వెంకన్నగౌడ్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి. టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, టీఆర్ఎస్ వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు, నాయకులు దావులయ్య, అశోక్, రమేష్, నరేష్, చెన్నారం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtu.be/76pw8xNAOuI

