శాంతిస్తున్న కరోనా
– తగ్గుకున్న పాజిటివ్ కేసులు
– తాండూరులో 61 మందికి కోవిడ్ నిర్దారణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: గత కొన్ని రోజులుగా ఉగ్రరూపం చూపిస్తున్న కరోనా మహమ్మారీ తాండూరులో శాంతిస్తుంది. తాండూరు ప్రాంతంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సెంచరీకీపైగా నమోదవుతూ వచ్చిన పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి. రెండు, మూడు రోజులుగా వందకు తక్కువగానే కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం 292 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 61 మందికి కోవిడ్ నిర్దారణ అయ్యింది. రోజూ మాదిరిగానే జిల్లా ఆసుపత్రిలో 236 మందికి పరీక్షలు నిర్వహించగా 55 మందికి, మాతా శిశు ఆసుపత్రిలో 56 మందికి పరీక్షలు నిర్వహించగా 6 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యిందని పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్ తెలిపారు. అదేవిధంగా మంగళవారం రెండు ఆసుపత్రులలో 351 మందికి పరీక్షలు నిర్వహించగా 95 మందికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు.

