గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
– బషీరాబాద్ మండలం అభివృద్ధికి ప్ర‌త్యేక దృష్టి
– రూ.2 కోట్లతో బిటి రోడ్లకు మరమ్మత్తులు
– నవల్గా గ్రామంలో 2 ట్యాంకుల నిర్మాణం..
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
బ‌షీరాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: గ్రామాల్లో మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్ర‌వారం బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో రూ.38.94 లక్షలతో నిర్మించనున్న రెండు తాగు నీటి ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త‌న సొంత మండ‌ల‌మైన బ‌షీరాబాద్ అభివృద్ధికి ప్ర‌త్యేక దృష్టిసారించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. మండలంలో పాడైన బిటి రోడ్లు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.2 కోట్లతో మైల్వార్ – కంసాన్ పల్లి, నవల్గా – మైల్వార్, కాసింపూర్- బాద్లాపూర్ – గొటిగాకలాన్, కొరిచేడ్, పర్వత్ పల్లి గ్రామాల బిటి రోడ్ల మరమ్మతులు చేయ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స‌హాకారంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ సైడ్ డ్రెయిన్లు, సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. నవల్గా గ్రామంలో ఎన్నో ఏళ్లుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని అందుకోసం గ్రామంలో నూతనంగా రెండు ట్యాంకులు నిర్మించబోతున్నట్లు తెలిపారు. మ‌రోవైపు న‌వ‌ల్గాలో స్వ‌ర్గీయ మాజీ సర్పంచ్ నర్సింలు గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, చాలా సంద‌ర్భాల‌లో గ్రామ సమస్యలపై తన దృష్టికి తీసుకు వచ్చే వారని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రాజు గౌడ్ నర్సిరెడ్డి, రాజ రత్నం, మునిందర్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాము నాయక్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, సర్పంచులు లాలూ, సూర్య నాయక్, దేవ్ సింగ్, నర్శి రెడ్డి, ఎంపిటిసిలు లక్ష్మి బాయి, స్థానిక నాయకులు రాజు, భాను, రవి, వెంకట్ తదితరులున్నారు.