హామిలను విస్మరించిన టీఆర్ఎస్ సర్కార్
– కాంగ్రెస్ హయాంలోనే పేదలకు న్యాయం
– చేవేళ్ల పార్లమెంట్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రెడ్డి
– దౌలాపూర్, గిరిజాపూర్‌లలో జోరుగా సభ్యత్వ నమోదు
యాలాల, దర్శిని ప్రతినిధి: ఇచ్చిన హామిలను అమలు చేయడంతో టీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విఫలమయ్యిందని కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల పార్లమెంట్ కోఆర్డీనేటర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం యాలాల మండలంలోని దౌలాపూర్ గ్రామపంచాయతీలో పార్టీ నాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యమానికి చేవేళ్ల పార్లమెంట్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రెడ్డి హాజరై కార్యకర్తల నుంచి సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే అభివృద్ధి, సంక్షేమం అందడంతో పేద ప్రజలకు న్యాయం జరిగిందని అన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో ఏడేళ్ల పాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇందుకోసం పార్టీకార్యకర్తలు సభ్యత్వ నమోదును భారీగా చేపట్టి పార్టీకి పూర్వవైభవం తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల అధ్యక్షులు భీమప్ప , తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్. ప్రశాంత్ కుమార్, యాలాల్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన్నన్, కాంగ్రెస్ నాయకులు మొగుడంపల్లీ నర్సింలు, డప్పు అనంతయ్య, డప్పు లాలప్ప, ముస్తఫా, వార్డు మెంబర్ కమలమ్మ, అక్కంపల్లి రామ్ చందర్, గిరిజపూర్, దౌలాపూర్ గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

