సగరులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగాలి
– ఎండ్లుగా చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వాలు
– సత్తాను సర్కారుకు చూపించేందుకు కృషి
– సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర
– తాండూరులో సగర కుల జన గణన కార్యక్రమం
తాండూరు, దర్శని ప్రతినిధి: సగరులు ఐక్యంగా ఉండి ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగరా అన్నారు. ఆదివారం తాండూరులో సగర కుల జన గణన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర హాజరై మాట్లాడుతూ తరాల తరబడి చరిత్ర ఉన్న సగరులను ప్రభుత్వాలు గుర్తించడం లేదని అన్నారు. సగరులను ప్రభుత్వం డీ గ్రూపులో ఉంచి ఉపాధి, ఉద్యోగవకాశాలలో, పథకాల వర్తింపులో వివక్ష చూపిస్తుందన్నారు. సగరులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అందరు కృషి చేయాలన్నారు. సగరులను గుర్తించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కుల జన గణన చేపడుతుందని, కావున సగరులు ఐక్యతను చాటుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. కుల, జన గణనలో సగరులను సంఖ్యను ప్రభుత్వానికి చాటి చెప్పేందుకు అందరు భాగస్వాములు కావాలన్నారు. జన గణన పూర్తి కాగానే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున సగర గర్జన పేరుతో భారీ బహిరంగా సభ నిర్వహించి సత్తాను ప్రభుత్వానికి చాటి చెప్పేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా స్థాయి యువజన సంఘాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు సగర సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తాండూరు అధ్యక్షుడు అనంతరాం సగర, ఉపాధ్యక్షుడు శివ కుమార్ సగర, కార్యదర్శి లాలయ్య సగం, జిల్లా అధ్యక్షుడు రవి సగర, కార్యదర్శి కృష్ణ సగర, రాష్ట్ర నాయకులు రాంచంద్రయ్య సగర, తట్టేపల్లి పీఏసీఎస్ డైరెక్టరు మల్లేషం సగర, పెద్దేముల్ మాజీ జడ్పీటీసీ స్వరూప, కోట్పల్లి వ్యవసాయ విపణి అధ్యక్షు: మహేందర్ సగర, భాజపా జిల్లా కార్యదర్శి రమేష్ సగర, మహిళా జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి సగర, కార్యదర్శి భాగ్యలక్ష్మీ సగర, సర్పంచులు యాదయ్య స్వర, శ్రవణ్ సగర, యశోదా సగర, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్ సగర, రాష్ట్ర యువజన సంఘం నాయకులు రాము సగర, మహేందర్ సగర, జిల్లాలోని ఆయా గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

