గంజాయి సాగుచేయొద్దు..!
– లెక్కచేయకుంటే రైతు బంధు రద్దు
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
– అంతారం గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం కృషి చేస్తుందని, రైతులు గంజాయి సాగు చేయొద్దని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధి అంతారం గ్రామంలో సర్పంచు రాములు ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవంపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి హాజరైన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇంకా అంటరానితనం, మూఢనమ్మకాల విశ్వాసం ఇంకా కొనసాగుతున్నాయని, అలాంటి వాటిని విశ్వసించరాదని సూచించారు. సమాజంలో అందరికి సమాన హక్కులు ఉంటాయని అందరు సమానమేనని అన్నారు. యువత కూడ సెల్ ఫోన్లు, మద్యం, ర్యాష్ డ్రైవింగ్, అమ్మాయిలు, మళ్లీ వాళల పట్ల వేధింపులు వంటి చర్యలకు పాల్పడరాదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చెడు దారిలో వెళ్లకుండా దృష్టిసారించాలన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక దృష్టిసారించిందని తెలిపారు. కావున రైతులు గంజాయి సాగు చేయరాదన్నారు. లెక్క చేయకుండా సాగుకు పాల్పడితే ప్రభుత్వ పథకాలు, రైతు బంధు రద్దు అవుతాయని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి సాగుచేస్తే పోలీసులకు సమచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గా ప్యంగా ఉంచుతామన్నారు. శాంతి భద్రతలకు ప్రజలు పోలీసులకు సహాకారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ్, గ్రామ కార్యదర్శి ఇస్మాయిల్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

