రోడ్డు దర్నాలో పలువురిపై కేసులు..?
– బీజేపీ నేతల ఫిర్యాదుతో పోలీసుల చర్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాలనీకి కొత్త రోడ్డు వేయాలంటూ దర్నాకు దిగిన వారిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

తాండూరు పట్టణం 7వ వార్డుకు చెందిన కాలనీ వాసులు రాయల్ కాంట సమీపంలో రోడ్డు వేయాలంటూ శనివారం దర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దర్నా సమయంలో కొందరు ప్రవేటు వ్యక్తులు జేసీబీతో రోడ్డును తవ్వేసి.. ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది.

దీనిపై మున్సిపల్ కమీషనర్ యాదగిరి తీవ్రంగా స్పందించారు. దర్నాల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం పద్దతి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా తాండూరు పట్టణ బీజేపీ నేతలు సైతం రోడ్డును ధ్వంసం చేయడాన్ని ఖండించారు. రోడ్డును ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్నాలో రోడ్డును ధ్వంసం చేసిన ముగ్గురితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

ఇదికూడా చదవండి…

