బీజేపీతోనే తెలంగాణ రాష్ట్రం
– ప్రత్యేక రాష్ట్రానికి సుశ్మాస్వరాజ్ కృషి
– మోడిపై రాష్ట్ర నాయకుల అనవర దుమారం
– తాండూరులో పార్టీతో పాటు నియోజకవర్గాభివృద్ధికి కృషి
– కాలుష్య నియంత్రణకు ఉద్యమం
– బీజేపీలో నిజమైన కార్యకర్తలకు స్థానం
– బీజేపీ తాండూరు నియోజకర్గ అసెంబ్లీ కన్వినర్ పటేల్ రవిశంకర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందని, రాష్ట్ర నాయకులు ప్రధాని మోడిపై అనవసర దూమారం రేపుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం స్వర్గీయ కేంద్ర మంత్రి సుశ్మాస్వరాజ్ ఎంతో కృషి చేశారని ఆ పార్టీ తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వినర్ పటేల్ రవిశంకర్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణం మంతడి పాండయ్య కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తలతో పటేల్ రవిశంకర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశానికి ప్రధాని నరేంద్రమోడి నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. ఆయన పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. దీనిపై న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వెల్లడయ్యిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నాయకులు మోడిపై అనవసర దూమారం రేపుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై బీజేపి కృతనిశ్చయంతో ఉందని, ప్రత్యేక రాష్ట్రం కోసం స్వర్గీయ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
తాండూరు ప్రజలకు అందుబాటులో ఉంటా
———————————————
బీజేపీ హైకమాండ్ అనుమతితోనే విదేశంలో తాను వ్యాపారానికి వెళ్లడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇకపై తాండూరులో ప్రజలకు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. తాండూరు ప్రాంతంలోని ఖనిజ సంపద దోపిడికి గురవుతుంటే ప్రజా ప్రతినిధులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. తాండూరులో నెలకొన్న సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణకు ఉద్యమిస్తామన్నారు. పార్టీ నాయకులందరితో కలిసి ముందుకు సాగి తాండూరులో బీజేపీతో పాటు ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామన్నారు.
త్వరలో పార్టీ ఇంచార్జ్ నియామకం
————————————
తాండూరులో తాను లేకపోయిన పార్టీ నాయకులు మనోహర్ రావు, నరేందర్ గౌడ్, సీనీయర్ నాయకులు పటేల్ విజయ్ కుమార్, బాలి శివకుమార్, కౌన్సిరల్లు కృషి చేశారని అన్నారు. త్వరలోనే తాండూరు పార్టీ ఇంచార్జ్ నియామకం జరగబోతుందన్నారు. పార్టీలోని యువనాయకులు నరుకుల నరేందర్ గౌడ్ ఇంచార్జ్‌గా నియామకం అయ్యే అవకాశం ఉందని అన్నారు. అందరి అభిప్రాయంతోనే ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. పార్టీలో పనిచేసే కార్యకర్తలకు స్థానం ఉంటుందని, దూరంగా ఉండే వారిపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని అన్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి ఎవ్వరికి టిక్కెట్ వచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సీటీజన్ రెస్పాన్సిబులికటి ఫోరం ప్రతినిధి సీఎన్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ నరుకుల సిందూజ నరేందర్ గౌడ్, కౌన్సిలర్ సంగీత అజయ్‌సింగ్ ఠాకూర్, నాయకులు సుధీర్, తాండూరు మండల పార్టీ అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు సంజీవరెడ్డి, గురురాజ్ జోషి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

