రీడింగ్‌తో విద్యా ప్రమాణాలు మెరుగు
– మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం రీడింగ్(చదువు ఆనందించు అభివృద్ధి) ప్రవేశ పెట్టిందని తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన టీఆర్ఎస్ కౌన్సిలర్ పద్దోళ్ల రత్నమాల నర్సింలు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వతి వాస్తున్న 100 రోజుల రీడింగ్ ప్రోగ్రాం కార్యక్రమంలో రత్నమాల నర్సింలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన పోటీలలో విజేత విద్యార్థులకు ఆమె బహుమతులను ప్రధానం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు రీడింగ్(చదువు ఆనందించు అభివృద్ధి చెందు) అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిందన్నారు. విద్యార్థులు పఠనాన్ని అలవర్చుకోవాలని, తప్పుల్లేకుండా చదువడం నేర్చుకుంటే రాణిస్తారని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రీడింగ్ ప్రోగ్రాంను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ గోపాల్, ఉపాధ్యాయులు బందెప్ప, రాధా. శశి రేఖ, సుజాత, సుధీర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

