తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.!.

తాండూరు రంగారెడ్డి రాజకీయం

తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.!.
– అధిష్టానం టిక్కెట్టు నాకే ఇస్తుందని ధీమా
– ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ కారు నేతలే
– మున్సిప‌ల్ చైర్పర్సన్ పదవికి ఐదేళ్లు డోకాలేదు
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఢంకా బజాయించారు. అధిష్టానం తనకే టిక్కెట్టు ఇస్తుందని ఆశీస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మీడియాలో సమావేశమైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయడం. ఖాయమన్నారు. సిట్టింగులకు టిక్కెట్టు ఇచ్చే విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, గతంలో వికారాబాద్, మేడ్చల్ నియోజకవర్గాలలో సిట్టింగులకు టిక్కెట్టు ఇవ్వలేదని ఉదహరించారు. కావున త‌న‌కే టిక్కెట్టు వ‌స్తుంద‌ని ఆశీస్తున్న‌ట్లు చెప్పారు. కొందరు స్వార్థ పరులే ఎమ్మెల్యే వెంట వెళ్లారని, అయినా వాళ్లందరు టచ్లో ఉన్నారని తెలిపారు. వాళ్లను ఎప్పుడు పిలిచినా వస్తారని అన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ కారు నేతలే ఉన్నారని విమర్శించారు. మంత్రి పదవిపై అధిష్టానం చేతుల్లో ఉందని, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. మరోవైపు మున్సిపల్ చైడ్ పర్సన్ పదవిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించారు. వచ్చే ఐదేళ్ల వరకు ఆమె పదవికి డోకా ఉండదన్నారు. మెజార్టీ కౌన్సిలర్లు ఆమెకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఒకవేళ అవిశ్వాసం ఎట్టాలనుకున్నా.. నాలుగేళ్ల వరకు వీలేలేదని అన్నారు. అప్పుడు పెట్టినా కూడ గెలుస్తామని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్. ఫ్లోర్ లీడర్ శోభారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.