పదివేల మంది శివబక్తులకు అన్నదానం
– సేవా తత్పరతను చాటుకుంటున్న శంకర్ యాదవ్
– తోడ్పాటు అందిస్తున్న మిత్రబ్బందం
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైలంలోని శివభక్తుల సేవలో తాండూరుకు చెందిన శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ తరిస్తున్నారు. గత రెండు రోజులుగా శ్రీశైల మల్లికార్జున, బ్రమరాంబ దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం చేస్తున్నారు.
గత ఆరేళ్లుగా శంకర్ యాదవ్ శ్రీశైలంలో అన్నదానం చేస్తున్నారు. ప్రతి యేడాది బ్రహ్మోత్సవాలలో పాల్గొని అన్నదానం చేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ యేడాదిలో గత రెండు రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రతిరోజూ 8 వేల నుంచి 10 మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు విశ్వంపంతులు బృందంతో పాటు తాండూరు స్నేహితుల బృందం, చెంగోల్ గ్రామ యువకులు, శివస్వాముల తోడ్పాటుతో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. శివ పార్వతుల దయ, ఆజ్ఞతోనే ఈ కార్యక్రమం చేపట్టడం సాధ్యమయ్యిందన్నారు. 25వ తేదీ నుంచి 27వ తేది వరకు ప్రతిరోజూ 8 వేల నుంచి 10 మంది భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాములు యాదవ్, హనుమయ్య, కుమారుడు అభినవ్ సాయి, కుర్వ విజయ్ కుమార్. పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, బీసీ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, కుర్వ జగదీష్, మేనల్లుడు అరవింద్ యాదవ్, మిత్రులు జొన్నల వినోద్, మనోహర్ యాదవ్, ప్రేమ్ కుమార్, చెంగోల్ ఎంపీటీసీ రాము, గడ్డం వెంకటేష్, మల్‌రెడ్డిపల్లి మధు, శ్రీను, కిరణ్ యాదవ్, శ్రీకాంత్, మల్లేష్ యాదవ్, చెంగోల్ గోపాల్, రవిశంకర్, నర్సయ్య గౌడ్, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

