భూకైలాస్‌లో శివున్ని దర్శించుకున్న కలెక్టర్ నిఖిల
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో వెలసిన శివున్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల దర్శించుకున్నారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా భూకైలాస్ క్షేత్రాన్ని కలెక్టర్ నిఖిల సందర్శించారు. భూకైలాస్‌లోని మహా శివలింగాలనికి పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. భక్తులపై, జిల్లా ప్రజలపై పరమ శివుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు తాండూరు పరిసర ప్రాంతాల ప్రముఖులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివుని పూజల కోసం పోటెత్తడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.

