గత కౌన్సిల్ నిధులతోనే సీసీ రోడ్డు నిర్మాణం
– పనులను పరిశీలించిన కోఆప్షన్ సభ్యురాలు బిర్కడ్ ఉశ
తాండూరు, దర్శిని ప్రతినిధి : గత కౌన్సిల్ నిధులతోనే తాండూరు పట్టణంలోని గాంధీనగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు బిర్కడ్ ఉశ పేర్కొన్నారు. శనివారం గాంధీనగర్లో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బిర్కడ్ ఉశ టీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో 22వ వార్డుగా ఉన్న గాంధీనగర్లో సీసీ రోడ్డుకు 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 5లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే అప్పట్లో కాలనీలో మురుగు కాలువ లేని కారణంగా సీపీ రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 20వ వార్డుగా మారిన గాంధీనగర్‌లో గత కౌన్సిలర్ నిధులతోనే సీసీ రో డ్డు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. సీసీ రోడ్డు ప్రారంభం అయినా కూడ త్వరలోనే కాలనీలో మురుగు కాలువ నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సహాకారంతో సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా ప్రస్తుతం చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతంగా చేపట్టాలని కాంట్రాక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆరేస్వి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ, జగదీశ్ మొచ్చి, వార్డ్ ప్రజలు పద్మ, గీత, కోట్ల రాజ్ కుమార్, మంగలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

