బీసీ విద్యార్థులేం పాపం చేశారు..?
– ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఫీజుల చెల్లింపులు
– ఇంజనీరింగ్‌లో బీసీల ఫీజులను కూడ ప్రభుత్వమే చెల్లించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతున్న బీసీ విద్యార్థులు ఏం పాపం చేశారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఇంజనీరింగ్ బీసీ విద్యార్థుల ఫీజుల చెల్లింపుల్లో సర్కారు బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని ఆవేధన వ్యక్తం చేవారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలోని 81 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు భారీగా పెంచారని తెలిపారు. ఇంకా 34 కాలేజీల్లో పెంచే అవకాశం కూడ కనిపిస్తుందన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలలో ఒక్కొ విద్యార్థి నుంచి రూ. 1లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు ఫీజులు దండుకుంటున్నారని, కాని ప్రభుత్వం రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తుందని అన్నారు. దీంతో పేద విద్యార్థులకు రూ. 1 లక్షల 15 వేల భారం పడుతుందని, ఈ భారం విద్యార్థుల తల్లిదండ్రులు మోసే పరిస్థితి లేదన్నారు. అయితే ఎస్సీ, ఎసీ, మైనార్టీలకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్న సర్కారు బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తుందన్నారు. బీసీలుగా పుట్టడమే విద్యార్థుల పాపమా.. అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.


