ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
– తాండూరు మండలం కొత్లాపూర్‌లో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఆర్థిక పరిస్థితి భాగాలేదని ఓ మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చెరుకు వెంకటేష్ బార్య లలిత(21)లు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే తమ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో ఉన్న గుర్తుతెలియని పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంభీకులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుగానే లలిత పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంభీకులకు అప్పగించారు.


