ఇర్ఫాన్‌కు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శ
– సంతాపం తెలిపిన ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణు టీఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ కుటుంబ సభ్యులను ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఇర్ఫాన్ తండ్రి, బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి మన్నన్ మరణించారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుమ్మరి గల్లిలోని ఇర్ఫాన్ నివాసానికి చేరుకున్నారు. తండ్రి మన్నన్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇర్ఫాన్‌ను పరామర్శించి ఓదర్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, సీనియర్ నాయకులు పద్దోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ జుబేర్గాల, నాయకులు మసూద్, జావేద్ భాయ్, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, వెంకన్నగౌడ్, రాము, బోయరవి తదితరులు ఉన్నారు.
సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి
మరోవైపు ఇర్ఫాన్ కుటుంబ సభ్యులను తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పరామర్శించారు.
తండ్రి భౌతిక ఖాయానికి నివాళులు అర్పించి ఆయన మరణం పట్ల సానుభూతిని తెలిపారు. విఠల్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.

