క్షయ బాధితులకు అండగా నిలవాలి
– జిల్లా క్షయ నివారణ అధికారి డా. రవీంద్ర యాదవ్
– తాండూరులో బాధితులకు నూట్రిషన్ కిట్ ల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: క్షయ వ్యాధి బాధితులకు అందరు అండగా నిలవాలని వికారాబాద్ జిల్లా క్షయ వ్యాధి నివారణ డాక్టర్ రవీంద్ర యాదవ్ అన్నారు. సోమవారం ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా తాండూరు విశ్రాంత ఉద్యోగి గాజుల బస్వరాజ్ ఆధ్వర్యంలో 6 మంది క్షయ బాధితులకు నూట్రీషన్ కిట్లను డాక్టర్ రవీంద్ర యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి బాధితుల పట్ల బాధ్యతను చూపించాలన్నారు. పేద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంఘాల నాయకులు క్షయ బాధితులకు అండగా నిలవాలన్నారు. క్షయ బాధితులకు విశ్రాంత ఉద్యోగి గాజుల బస్వరాజ్ నూట్రిషన్ కిట్లను అందించేందుకు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి మల్లేశం. సీవీయర్ ల్యాబ్ సూపర్ వైజర్ అరుణ్ కుమార్, సీనియర్ సూపర్ వైజర్ బస్వరాజ్, ల్యాబ్ టెక్నిషీయన్ మధుశీల తదితరులు పాల్గొన్నారు.

