పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వ్యక్తి
– సూర్యాపేట జిల్లాకు చెందిన ఐఏఎస్ వేణుప్రసాద్ నియామకం
దర్శిని డెస్క్ : పంజాబ్ ఆప్ పార్టీ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ముఖ్య కార్యదర్శిగా తెలంగాణకు చెందిన ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ నియామకమయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ జయకేతనం ఎగురవేవయడంతో భగవంత్ మాన్ ఈనెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంకు అదనపు ప్రధాన కార్యదర్శిగా పంజాబ్ రాష్ట్ర విద్యుత్తు సంస్థ(పీఎస్‌పీసీఎల్)కు సీఎండీగా అరికంటి వేణు ప్రసాద్‌ను నియమించారు. అయితే వేణు ప్రసాద్ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న ఆయన స్వస్థలం కావడం విశేషం. పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ఆద్మీ పార్టీ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో ఈ కీలక పోస్టులో ఆయనను నియమించటం ప్రాధాన్యత సంతరించుకొన్నది. మరోవైపు వేణు ప్రసాద్ విద్యుత్తు శాఖలో అవిభక్త కవలలకు ఉద్యోగం ఇచ్చి మానవత్వం చాటుకుని ఈయన దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. వేణుప్రసాద్ సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్నత స్థానానికి చేరుకోవడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐఏఎస్ వేణుప్రసాద్ వ్యక్తిగత వివరాలు:
పేరు: అరికంటి వేణుప్రసాద్
తల్లిదండ్రులు: రంగయ్య, మంగమ్మ
పుట్టిన సంవత్సరం: 1964
ప్రాథమిక విద్య: మునగాల
పదో తరగతి : ఖమ్మం
ఇంటర్: నాగార్జునసాగర్‌లోని గురుకుల జూనియర్ కాలేజీ
డిగ్రీ: బాపట్ల వ్యవసాయ కళాశాల (1980)
పీజీ: ఎంబీఏ (ఫైనాన్స్), ఎంఏ (పబ్లిక్ పాలసీ)-అమెరికా
సివిల్స్: 1991
క్యాడర్: పంజాబ్

