గౌడ ఆత్మీయ సమ్మేళనానికి రండి
– మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ నేత ఆర్ కృష్ణయ్యను స్వాగతించిన నాయకులు
– తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్లకు ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో త్వరలో జరిగే గౌడ ఆత్మీయ సమ్మేళనానికి రావాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను తాండూరు గౌడ సంఘం నాయకులు ఆహ్వానించారు. సోమవారం తాండూరు గౌడ సంఘం ఆధ్వక్షులు రాజుగౌడ్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు హరిహరగౌడ్, ప్రభాకర్ గౌడ్, సంతోష్ గౌడ్, రాజన్ గౌడ్, సుదర్శన్ గౌడ్ తదితరులు హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్ గౌడను కలిశారు. తాండూరులో త్వరలో గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వ హిస్తున్నామని, ఈ సమావేశానికి తప్పకుండా రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆహ్వానించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను నాయకులు సన్మానించి మొక్కను బహుకరించారు.
అదేవిధంగా హైదరాబాద్లోనే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్లను కూడ కలిసి సమ్మేళానికి రావాలని ఆహ్వానించారు. అంతేకాకుండా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్యను కూడ గౌడ నాయకులను కలిశారు. తాండూరులో నిర్వహించే గౌడ ఆత్మీయ సమ్మేళానికి రావాలని స్వాగతించారు. అనంతరం ఆర్.కృష్ణయ్యను కూడ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూరు గౌడ నాయకులు ఉన్నారు.


