హుజూరాబాద్ అభ్య‌ర్థిని ఎంపిక చేసిన హ‌స్తం

తెలంగాణ రాజకీయం హైదరాబాద్

హుజూరాబాద్ అభ్య‌ర్థిని ఎంపిక చేసిన హ‌స్తం
– ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడు బల్మూర్ వెంకట్‌కు చాన్స్
హైద‌రాబాద్‌, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: సుదీర్ఘ కసరత్తు తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యం మేర‌కు ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట నర్సింగరావు పేరును ఖరారు చేశారు. , టీఆర్‌ఎస్‌ తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై శుక్రవారం సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ చర్చలో పలువురి పేర్లు పరిశీలనకు వచ్చినా చివ‌ర‌కు బల్మూరు వెంకట్‌ పేరును కాంగ్రెస్‌ ముఖ్యులు ప్రతిపాదించారు. రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా బల్మూరు వెంకట్‌ రెండు పర్యాయాలుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ తదితరులతో చర్చించిన అనంతరం వెంకట్ పేరును ఖరారు చేశారు. ఈమేరకు రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి సిఫార్సు చేసింది.