ప్ర‌తిప‌క్ష కౌన్సిల‌ర్ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తా

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్ర‌తిప‌క్ష కౌన్సిల‌ర్ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తా
– మున్సిప‌ల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ ప్ర‌తిప‌క్ష కౌన్సిల‌ర్ల‌పై చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం మున్సిప‌ల్ కార్యాల‌యంలో టీజేఎస్, కాంగ్రెస్, సీపీఐ పార్టీల‌కు చెందిన కౌన్సిల‌ర్లు చేప‌ట్టిన నిర‌స‌న‌లో త‌న‌పై విమ‌ర్శ‌లు చేశార‌ని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన మీడీయా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మున్సిప‌ల్‌లో నాకు చెందాల్సిన హక్కుల గురించే బ‌డ్జెట్ స‌మావేశంపై కోర్టును ఆశ్రయించడం జరుగుతుందన్నారు. దీనిపై ప్ర‌తిప‌క్ష కౌన్సిల‌ర్లు త‌ప్పుడు విధంగా ప్ర‌చారం జ‌రిగేలా త‌న‌పై ఆరోప‌ణ‌లు చేశార‌ని అన్నారు. ఎప్పుడు తనపై ఆరోపణలు చేయడాన్నే ప్రతిపక్ష కౌన్సిలర్లు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎనాడు వార్డు అభివృద్ధి, సమస్యలపై సంప్రదించలేదన్నారు. ప్రతి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం బడ్జెట్ సమావేశం వ్యవహారంలో అధికారులను కార్యాలయంలో బంధించిన ప్రతిపక్ష కౌన్సిలర్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అధికారుల జోలికి వచ్చిన కౌన్సిలర్లను వదిలేదిలేదన్నారు. అభివృద్ధికి ఎనాడు అడ్డుపడలేదని, తాండూరు పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బోయరవి, వెంకన్నగౌడ్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి ఉన్నారు.