విద్యార్థులకు సర్కారు ప్రాధాన్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులకు సర్కారు ప్రాధాన్యం..!
– మెస్‌ చార్జీల పెంపు హర్షణీయం
– కాంగ్రెస్ నాయకులు, న్యాయవాది జిలాని
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తుందని తాండూరు కాంగ్రెస్ నాయకులు, న్యాయవాది జిలాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని విద్యార్థులు వేడుకున్న గత ప్రభుత్వం పెంచలేదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కూడా గడవకముందే విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా దాదాపుగా 40% వరకు మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచడం ఎంతో గర్వకారణమన్నారు.

మూడవ తరగతి నుండి ఏడో తరగతి వరకు మెస్ ఛార్జీలు రూ. 950 నుండి 1330 వరకు, అదేవిధంగా ఎనిమిదో క్లాస్ నుండి పదో క్లాస్ వరకు రూ. 1100 నుండి రూ. 1540 వరకు, కాలేజీ విద్యార్థులకు రూ. 1500 నుండి రూ. 2100 వరకు 40% మేర పెంచడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కాస్మోటిక్ చార్జీలు మూడో తరగతి నుండి ఏడో తరగతి వరకు రూ. 55 నుండి రూ. 175 వరకు, 8వ తరగతి నుండి పదో తరగతి, ఆపై తరగతులకు అమ్మాయిలకు రూ. 75 నుండి రూ. 275 వరకు పెంచడం జరిగిందన్నారు.

అదేవిధంగా అబ్బాయిలకు కాస్మోటిక్ చార్జీలు మూడో తరగతి నుండి ఏడో తరగతి వరకు రూ. 62 నుండి రూ. 150 వరకు, ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి, ఆ పై తరగతి అబ్బాయిలకు రూ. 62 నుండి రూ. 200 వరకు కాస్మోటిక్ చార్జీలు పెంచి పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. విద్యార్థులకు 40 శాతం మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచడం కాకుండా పది రోజుల్లో దీన్ని అమలు చేయాలని సంబంధిత సంక్షేమ హాస్టల్లో సెక్రెటరీల సమావేశం ఏర్పాటు చేసి నిన్ననే సీఎం చెప్పడం పేద విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఖోఖో వీరులు.. గౌతమి విద్యార్థులు..!