లోకాయుక్తపై ఫిర్యాదుపై కదలిక
– పోటీమహారాజ్ దేవాలయాన్ని సందర్శించిన ఆర్డీఎంఏ
– దేవాలయ ప్రాంగణంలో ఆస్తుల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిది : తాండూరు పట్టణంలోని ప్రసిద్ద పోట్లీ మహారాజ్ దేవాలయ ఆస్తులకు సంబంధించి లోకాయుక్తలో సమర్పంచిన కేసుపై అధికారుల్లో కదలిక వచ్చింది. గురువారం హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ (ఆర్డీఎంఏ) శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. గత కొన్నేళ్ల క్రితం పట్టణానికి చెందిన ప్రభకార్ అనే వ్యక్తి లోకాయుక్తలో ఓ ఫిర్యాదు చేశారు. దేవాలయానికి చెందిన ప్రాంగణంలో కొనసాగుతున్న కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్, అద్దెలపై ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆదేశాల మేరకు ఆర్డీఎంఏ శ్రీనివాస్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించారు. తాండూరు ఆర్జీఓ ఆశోక్ కుమార్, దేవాలయ ఈఓతో పాటు చైర్మన్ రాజన్ గౌడ్ తో కలిసి విచారణ జరిపారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు, లొకాయుక్తకు అందజేస్తామని ఆర్డీఎంఏ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అనంతరం ఆలయ ఆస్తులు, అభివృద్ధిపై ఆర్డీఎంఏ శ్రీనివాస్ రెడ్డి ఆలయ చైర్మన్ రాజన్ గౌడ్‌తో చర్చించారు. ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజన్‌గౌడ్ మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో ఆలయాభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, టీపీఎస్ జీషాన్ తదితరులు ఉన్నారు.


