సాయిపూర్పై సీసీ నిఘా వలయం
– 25 నిఘా నేత్రాల ఏర్పాటు
– నేతలు ముందుకు రావడం అభినందనీయం
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్పై సీసీ నిఘా వలయాన్ని ఏర్పాటుకు దృష్టిసారిస్తున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయిపూర్ ప్రాంతంలో సీఐ రాజేందర్ రెడ్డి పర్యటించారు. సాయిపూర్కు చెందిన సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల బాల్రెడ్డి, యాదిరెడ్డిలతో కలిసి సాయిపూర్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాంతాలను పరిశీలించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు చూపిస్తున్న చొరవకు నాయకులు మద్దతు తెలిపారు. సాయిపూర్ ప్రాంతంలో 25 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తామని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమైనవన్నారు. కెమెరాల ఏర్పాటుకు అందరు ముందుకు రావాలన్నారు. సాయిపూర్లో పోలీసుశాఖ, స్థానిక నాయకుల సహాకారంతో నిఘా నేత్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, సాయిపూర్ పెద్దలు, ప్రజలు ఉన్నారు.
ఈ వార్తను సమర్పించిన వారు

