రెండో రోజు కొనసాగిన కార్మికుల సమ్మె
– విధులు బహిష్కరించి నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్మికులు రెండో రోజు దేశ వ్యాప్త సమ్మెను కొనసాగించారు. మంగళవారం ఉదయం నుంచి విధులు బహిష్కరించారు. పాత మున్సిపల్ భవనం ముందు బైటాయించి నిరసన చేపట్టారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు, కార్మికులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై పనిభారం మోపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్ కార్మికులకు వేతనాలను చెల్లించాలని, 11వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా వంటావార్పుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఐయూటీసీ నాయకులు గోపాల్, ఎస్. గోపాల్, నర్సింలు, వెంకటేష్, అశోక్, కార్మికులు పాల్గొన్నారు.
ఈ వార్తను సమర్పించినవారు 

