వైస్ చైర్ పర్సన్‌పై విమర్శలు చేస్తే ఖబడ్దార్
– వర్గ భేదాలు చూపిస్తుంది చైర్ పర్సనే
– వ్యాఖ్యలను ఖండించిన యువనాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌పై అనవసర విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఖబడ్దార్ అంటూ తాండూరు టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవరావు, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు రవికుమార్, కార్యదర్శి చంటి యాదవ్‌లు హెచ్చరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులు పరిమళ్ గుప్త మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైస్ చైర్ పర్సన్ చెంచా రాజకీయాలు చేస్తున్నారనడం, ప్రతిపక్ష కౌన్సిలర్లతో కుమ్మక్కైయ్యారని విమర్శించడం తగదన్నారు. అభివృద్ధిలో, రాజకీయాలలో చైర్ పర్సనే వర్గభేదాలు చూపిస్తున్నారని విమర్శించారు. తాండూరులో మంత్రి, ఎమ్మెల్యే కార్యక్రమాలకు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన చైర్ పర్సన్ హాజరుకాకపోవడం వెనుక కారణలేంటని ప్రశ్నించారు. చైర్ పర్సన్‌పై వైస్ చైర్ పర్సన్ ఏనాడు వ్యతిరేకంగా వ్యవహరించలేదని అన్నారు. వైస్ చైర్ పర్సన్‌పై ఓర్వలేక విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా వైస్ చైర్ పర్సన్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

