భ‌ద్రేశ్వ‌ర వైభోగం..!

తాండూరు వికారాబాద్

భ‌ద్రేశ్వ‌ర వైభోగం..!
– నేత్ర‌ప‌ర్వంగా ర‌థ‌చ‌క్రాల పూజ‌లు
– జాత‌ర ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌
– పూజ‌ల్లో పాల్గొన్న చైర్ ప‌ర్స‌న్, స‌మాజం పెద్ద‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణ న‌డిబొడ్డున వెల‌సిన శ్రీ భావిగి భ‌ద్రేశ్వ‌రునికి వైభోగం సంత‌రించుకుంది. భ‌ద్రేశ్వ‌ర జాత‌ర ఉత్స‌వాలకు శ‌నివారం అంకురార్ప‌ణ చేశారు. ప్ర‌తి యేడాది ఆన‌వాయితీ ప్ర‌కారం ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా భ‌ద్రేశ్వ‌ర జాత‌ర ర‌థ చ‌క్రాల‌కు పూజ‌లు నిర్వ‌హించారు. దేవాల‌యం చైర్మ‌న్ బంటారం సుధాక‌ర్, దేవాల‌య ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న పరిమళ్ గుప్తా, మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్, స‌మాజం స‌భ్యుల‌తో కలిసి రథచక్రాల ఇరుసుల పూజలో పాల్గొన్నారు. అంతకుముందు రథచక్రాలను బయటకు తీశారు. కూడలిలో చక్రాలకు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా చ‌క్రాల పూజ‌ల‌కు ముందు ఆలయంలో భద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం వినించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బంటారం లావణ్య, వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, సభ్యులు గాజుల శాంతుకుమార్, బంటారం భద్రేశ్వర్, మహంతయ్య స్వామి. విజయ్ కుమార్ స్వామి, సమాజం సభ్యులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.