పేదల నడ్డి విరుస్తున్నకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి
– సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ధరలనె పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల నడ్డి విరుస్తున్నారని, కార్పోరేట్‌కు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజీల్, విద్యుత్, గ్యాస్, ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను ఆకాశానికి పెంచుతూ పేద ప్రజలపై రోజురోజుకు భారం మోపిందన్నారు. పేదలు, కార్మికులు, రైతులు కష్టజీవుల జీవనానికి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రజల పైన భారాలు వేస్తూ పెట్టుబడి దారులకు కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. రాబోయే రోజులలో కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, సీపీఎం నాయకులు నర్సింలు, రాములు, మహేష్, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఫయాజ్, అబూ, అంజాద్ నారాయణ, అశోక్, కార్మికులు పాల్గొన్నారు.

