నిర్ధిష్ట లక్ష్యాలతోనే ఉన్నత భవిష్యత్తు
– భాష్యం కళాశాల డైరెక్టర్ పర్యాద రామకృష్ణ
– ఉత్సాహంగా కళాశాల వీడ్కోలు వేడుక
– ఆకట్టుకున్న ఢీ-13 కావ్య శ్రీ నృత్య ప్రదర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి: నిర్ధిష్ట లక్ష్యాలు ఉంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగి భవిష్యత్తును నిర్మించుకోవడంతో సాధ్యమవుతుందని తాండూరు భాష్యం జూనియర్ కళాశాల డైరెక్టర్ పర్యాద రామకృష్ణ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్‌లో భాష్యం కళాశాల వీడ్కోలు వేడుక(ఫేర్‌వెల్ పార్టీ) “విజయభవ-2023” ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో కళాశాల విద్యార్థి ఢీ-13 టైటిల్ విన్నర్ కావ్య శ్రీ, విద్యార్థుల సాంప్రదాయిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలో సావిత్రి భాయిపూలే వర్థంతిలో భాగంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా అంబేద్కర్, చంద్రశేఖర్ ఆజాద్, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, ఫ్రోఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు కూడ నివాళులు అర్పించారు.

అనంతరం తాండూరు ప్రాంతంలో గత 18సంవత్సరాలుగా సుమారు 25వేల వరకు ఉచిత కంటి చికిత్సలు చేయించిన బసవ ఆప్టికల్స్ యజమాని నాగరాజును కళాశాల తరపున ఘనంగా సన్మానించారు. కళాశాల డైరెక్టర్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని ఉన్నత శిఖరాలను చేరాలని అన్నారు. భయం వీడితే అన్నింట్లో విజయం సాధిస్తారని, నిరంతర కృషి చేయాలని అన్నారు. నిర్ధిష్ట లక్ష్యాలు ఉంటే ఉన్నత శిఖరాలకు ఎదిగి భవిష్యత్తును నిర్మించుకోవచ్చన్నారు. అదేవిధంగా గత ఏడాది రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించిన విధంగా ఈ యేడాది కూడ భాష్యం కళాశాల విద్యార్థులు పోటీ పరీక్షలల్లో సత్తా చాటాలన్నారు. తాండూరుకు విద్యార్థులు మరోసారి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా డాక్టర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థి శక్తే జాతీయ శక్తి అని అభివర్ణించారు. సమాజ శ్రేయస్సు కోసం మహానుభావుల స్పూర్తితో కృషి చేయలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డి,కళాశాల డైరెక్టర్ అజిత్ షిండే, అధ్యాపకులు వెంకట్ రెడ్డి, మల్లికార్జున్, శాంతయ్య, శ్రీనివాస్, భాను, శ్రీనివాస్, మధురిమ, పూర్ణిమ, శ్రుతి, విద్యార్థులు పాల్గొన్నారు.

