అత్తాగారింటికి వెళితే అనుకొని ప్ర‌మాదం

క్రైం తాండూరు వికారాబాద్

అత్తాగారింటికి వెళితే అనుకొని ప్ర‌మాదం
– ఇంటికి మంట‌లు అంటుకుని భారీగా ఆస్తిన‌ష్టం
– పెద్దేముల్ మండ‌లం గిర్మాపూర్‌లో ఘ‌ట‌న
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: అంత్యక్రియ‌ల కోసం అత్తగారింటికి వెళ్ల‌గా అల్లుడు ఇంట్లో అనుకోని ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాద వ‌శాత్తు మంట‌లు అంటుకుని ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్ర‌మాదంతో దాదాపు నాలుగు ల‌క్ష‌ల వ‌ర‌కు ఆస్తిన‌ష్టం జ‌రిగింద‌ని బాధితుడు వాపోయాడు. వివ‌రాల్లోకి వెళితే పెద్దేముల్ మండ‌లం గిర్మాపూర్ గ్రామానికి చెందిన జంగం చంద్ర‌శేఖ‌ర్ సోమ‌వారం త‌న అత్త‌గారు మ‌ర‌ణించార‌ని తెలిసి గ్రామానికి బ‌య‌ల్దేరారు. అదేరోజు రాత్రి జంగం చంద్ర‌శేఖ‌ర్ ఇంట్లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. గ‌మ‌నించిన స్థానికులు తాండూరు అగ్నిమాప‌క‌శాఖ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించి మంట‌ల ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో జంగం చంద్రశేఖ‌ర్‌కు కూడ స‌మాచారం అందించారు. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఇంట్లో ఉన్న న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాలు, టీవీ, ఫ్రిజ్ ఇంకా విలువైన వ‌స్తువులు కాలి బూడిద‌య్యాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం బాధితుడు జ‌రిగిన ప్ర‌మాదాన్ని, ఆస్తిన‌ష్టాన్ని వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా అగ్ని ప్ర‌మాద‌శాఖ అధికారులు స‌కాలానికి స్పందించి ఉంటే పెద్ద మొత్తంలో ఆస్తిన‌ష్టం జ‌రిగిఉండేది కాద‌ని గ్రామ‌స్తులు వాపోయారు. మ‌రోవైపు బాధిడుతు జంగం చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ ప్ర‌భుత్వం ప‌రిహారి అందించి ఆదుకోవాల‌ని కోరుతున్నాడు.