బీజేపీ రైతు ద్రోహి
– తెలంగాణ రైతాంగంపై సవతి ప్రేమ
– ధాన్యం కొనేదాకా ఊరుకునేది లేదు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– నిరసన ర్యాలీ, మోడి దిష్టిబొమ్మ దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రైతుల పట్ల బీజేపీ ద్రోహానికి పాల్పడుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం తాండూరులో టీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలు అట్టహాసంగా కొనసాగాయి. నిరసన పిలుపులో భాగంగా నల్ల జెండాలు ప్రదర్శిస్తూ పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్పంచుకుని నాయకులను, రైతులను ఉత్తేజ పరిచారు. బైక్ ర్యాలీ ద్వారా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దేశ ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతుల పట్ల కేంద్రం సవతి ప్రేమను ప్రదర్శిస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ద్రోహం చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల అభివృద్ధికి రైతు వేధికలు, రైతు బంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తుంటే కేంద్రం ఓర్వలేని తనంతో నీవరాజకీయాలు చేస్తుందని విమర్శించారు. పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం కొని తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయరని కేంద్రాన్ని నిలదీశారు. మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న కేంద్రానికి రైతుల ఉసురు తప్పదన్నారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, రాజుగౌడ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం. శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, దేవాలయాల చైర్మన్లు రాజన్ గౌడ్, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ యాదవ్, మహిళ నాయకురాలు శకుంతల, నాయకులు రవీందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబు, వెంకట్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.


