పండగలు శాంతియుతంగా జరుపుకోవాలి

క్రైం తాండూరు వికారాబాద్

పండగలు శాంతియుతంగా జరుపుకోవాలి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వచ్చే పండగలను శాంతియుతంగా జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఓ హోటల్ ఫంక్షన్ హాల్లో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ వచ్చే శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి, రంజాన్ పండగలతో పాటు పట్టణంలోని ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భద్రేశ్వర జాతర ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండగల వేళల్లో అల్లర్లు సృషించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. పండగలను శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు అందరు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్, తాండూరు డీఎస్సీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, కౌన్సిలర్ విజయదేవి, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ బంటారం సుధాకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు రాజుగౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, తాండూరులోని రాజకీయ, కుల, మత సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు.