ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి
– నివాళులు అర్పించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలను సోమవారం తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. తాండూరు ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో, పట్టణంలోని దిగ్రైన్ మర్చంట్స్ ఆపోసియేషన్ హాల్లో జయంతి వేడుకలను నిర్వహించి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా

బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీపీఐ, సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి నాయకులు శ్రీనివాస్, తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


